Songtexte.com Drucklogo

Egire Egire Songtext
von Shankar–Ehsaan–Loy

Egire Egire Songtext

ఎగిరే ఎగిరే
ఎగిరే ఎగిరే

చూపే ఎగిరెనే
చీకటి ఎరగని దారిలో
పాదం ఎగిరెనే
భయమే తెలియని బాటలో
ప్రాయం ఎగిరెనే
పరిచయమవ్వని త్రోవలో
Fly high in the sky

ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా


మనసే అడిగిన ప్రశ్నకే
బదులొచ్చెను కదా ఇపుడే
ఎపుడూ చూడని లోకమే
ఎదురొచ్చెను కదా ఇచ్చటే
Oh ఈ క్షణమే సంబరం
ఈ క్షణమే శాశ్వతం
ఈ క్షణమే జీవితం
తెలిసింది ఈ క్షణం
మౌనం కరిగెనే
మాటలు సూర్యుడి ఎండలో
స్నేహం దొరికెనే
నవ్వులు చంద్రుడి నీడలో
ప్రాణం పొంగెనే
మెరుపులు తారల నింగిలో
Fly high in the sky

ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా

తెలుపు నలుపే కాదురా
పలు రంగులు ఇలా సిద్ధం
మదిలో రంగులు అద్దరా
మన కథలకు అదే అర్థం
Oh సరిపోదోయ్ బ్రతకడం
నేర్చేయ్ జీవించడం
గమనం గమనించడం
పయనంలో అవసరం
చేసెయ్ సంతకం
నడిచే కాలపు నుదిటిపై
రాసెయ్ స్వాగతం
రేపటి కాలపు పెదవిపై
పంచెయ్ స్నేహితం
కాలం చదివే కవితవై
Fly high in the sky


ఎగిరే ఎగిరే పైకెగిరే
కలలే అలలై పైకెగిరే
పలుకే స్వరమై పైకెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Egire Egire« gefällt bisher niemandem.