Songtexte.com Drucklogo

Akasam Ammayaithe Songtext
von Shankar Mahadevan & Gopika Purnima

Akasam Ammayaithe Songtext

(ఏం చక్కని మందారం
ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం
ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం
ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం
ఇక తియ్యని ప్రేమకి తయ్యారం)

ఓ ఆకాశం అమ్మాయైతే
నీలా ఉంటుందే నీలా ఉంటుందే


ఓ,ఆనందం అల్లరి చేస్తే
నాలా ఉంటుందే
నాలా ఉంటుందే (నాలా ఉంటుందే)
వానల్లే నువ్వు జారగా
నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమవుతుందే
Hola, hola, hola, hola
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
Hola, hola, hola, hola
ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

(ఏం చక్కని మందారం
ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం
ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం
ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం
ఇక తియ్యని ప్రేమకి తయ్యారం)

అల్లేసి నను గిల్లేసి
తెగ నవ్వినావే సుగుణాల రాక్షసీ
శత్రువంటి ప్రేయసి
పట్టేసి కనికట్టేసి
దడ పెంచినావే దయలేని ఊర్వశి
దేవతంటి రూపసి


గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే
నిద్దుర పుచ్చేనే
లోకంలో అందాలన్నీ నీలో చేరెనే
నిద్దుర లేపెనే
Hola, hola, hola, hola
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
Hola, hola, hola, hola
ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

(ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం)

వచ్చేసి బతికిచ్చేసి
మసి చేసినావే రుషి లాంటి నా రుచి మార్చినావే అభిరుచి
సిగ్గేసి చలిమొగ్గేసి
ఉసి గొలిపినావె సరిగమగా పదనిసి చేర్చినావే రోదసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే
ప్రాణం పోసేనే
నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే

Hola, hola, hola, hola (hola, hola)
నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
Hola, hola, hola, hola (hola, hola)
ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

(ఏం చక్కని మందారం
ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం
ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం
ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం
ఇక తియ్యని ప్రేమకి తయ్యారం)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Welcher Song ist nicht von Britney Spears?

Fans

»Akasam Ammayaithe« gefällt bisher niemandem.